రాష్ట్రానికి భాజపా ద్రోహం

 విభజన హామీలను అమలు చేయకుండా కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు. ‘దేశ రక్షణ భేరి’ సభల ముగింపు సందర్భంగా బుధవారం అనంతపురం నగరంలో

Published : 29 Sep 2022 04:43 IST

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

అనంతపురం ఆజాద్‌నగర్‌, న్యూస్‌టుడే:  విభజన హామీలను అమలు చేయకుండా కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు. ‘దేశ రక్షణ భేరి’ సభల ముగింపు సందర్భంగా బుధవారం అనంతపురం నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం స్థానిక గాంధీ విగ్రహానికి శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైల్వే జోన్‌ ఇస్తామని రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం హామీ ఇచ్చినా, భాజపా అధికారం చేపట్టాక జోన్‌ ఇవ్వలేమని అధికారులు ప్రకటించడం శోచనీయమని వ్యాఖ్యానించారు. దీనిపై వైకాపా స్పందించి రైల్వే జోన్‌ సాధనకు డిమాండు చేయాలని కోరారు. అఖిలపక్షాన్ని తీసుకెళ్లి అడగాలని సూచించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీపైనా మోసం చేసిందని ఆరోపించారు. పోలవరానికి నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. కార్యదర్శి వర్గ సభ్యుడు సుబ్బారావు మాట్లాడుతూ.. కేంద్రం ప్రజలపై పన్నుల భారం మోపుతూ కార్పొరేట్‌ కంపెనీలకు రాయితీ ఇస్తోందని దుయ్యబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని