స్వార్థ ఆలోచనలతో రాష్ట్రానికి నష్టం: ధర్మాన

గత ప్రభుత్వంలో చంద్రబాబునాయుడి స్వార్థపూరిత ఆలోచనల కారణంగానే రాష్ట్రానికి నష్టం జరిగిందని, ఇప్పటికీ రాజధాని లేకుండా పోవడానికి ఆయనే కారణమని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు.

Published : 04 Oct 2022 05:26 IST

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: గత ప్రభుత్వంలో చంద్రబాబునాయుడి స్వార్థపూరిత ఆలోచనల కారణంగానే రాష్ట్రానికి నష్టం జరిగిందని, ఇప్పటికీ రాజధాని లేకుండా పోవడానికి ఆయనే కారణమని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. పాలన వికేంద్రీకరణకు మద్దతుగా సోమవారం రాజమహేంద్రవరంలో ఎంపీ భరత్‌రామ్‌ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మంత్రి ధర్మాన మాట్లాడారు. ‘అమరావతి చుట్టుపక్కల భూములను తన అనుచరులతో కొనిపించి చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. రాజధాని పేరుతో అవసరానికి మించి భూములు సేకరించి అక్కడి రైతులను బలిచేశారు. ఇప్పుడు వికేంద్రీకరణ దిశగా మా ప్రభుత్వం అడుగులు వేస్తుంటే వ్యతిరేకిస్తున్నారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ అనుకూలమైన ప్రాంతం..’ అని ధర్మాన పేర్కొన్నారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, పలువురు ఎమ్మెల్యేలు, వివిధ రంగాల్లోని నిపుణులు, మేధావులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని