కాంగ్రెస్‌ది బానిస మనస్తత్వం

మంచి పనులను అడ్డుకోవడం, జాప్యం చేయడం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం మాత్రమే కాంగ్రెస్‌కు తెలుసని ప్రధాని మోదీ విమర్శించారు.

Published : 03 Dec 2022 05:08 IST

ప్రధాని మోదీ విమర్శ

అహ్మదాబాద్‌: మంచి పనులను అడ్డుకోవడం, జాప్యం చేయడం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం మాత్రమే కాంగ్రెస్‌కు తెలుసని ప్రధాని మోదీ విమర్శించారు. వాటినే ఆ పార్టీ విశ్వసిస్తుందని పేర్కొన్నారు. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం బనాస్‌కాంఠా జిల్లాలోని కాంక్రేజ్‌ గ్రామం, ఉత్తర గుజరాత్‌లోని పాటణ్‌ పట్టణం, ఆణంద్‌ జిల్లాలోని సొజిత్రా నగరంలో నిర్వహించిన ర్యాలీల్లో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్‌ను లక్ష్యంగా  విమర్శల వర్షం కురిపించారు. ఆ పార్టీ బానిస మనస్తత్వాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్‌వారితో కలిసి ఏళ్లపాటు పనిచేసి ఉండటం వల్ల ఆ లక్షణం అబ్బి ఉండొచ్చంటూ ఎద్దేవా చేశారు.

ముగిసిన మోదీ ప్రచారం : గుజరాత్‌ ఎన్నికలకు సంబంధించి తన ప్రచార కార్యకలాపాలను ప్రధాని మోదీ శుక్రవారంతో ముగించారు. రాష్ట్రంలో ఈ దఫా మొత్తంగా ఆయన 31 ర్యాలీల్లో ప్రసంగించారు. 3 భారీ రోడ్‌షోలను నిర్వహించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు