ప్రభుత్వ ప్రోత్సాహంతోనే విగ్రహాలపై దాడులు: అచ్చెన్న

వైకాపా ప్రభుత్వ ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో ఎన్టీఆర్‌ విగ్రహాలపై తరచూ దాడులు జరుగుతున్నాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

Published : 09 Dec 2022 05:16 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి : వైకాపా ప్రభుత్వ ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో ఎన్టీఆర్‌ విగ్రహాలపై తరచూ దాడులు జరుగుతున్నాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో ఎన్టీఆర్‌ విగ్రహం తొలగింపు జగన్‌రెడ్డి అరాచక పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్‌కు ఎన్నోసార్లు అవమానాలు జరిగాయని గురువారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎన్టీఆర్‌ విగ్రహాలను తొలగిస్తూ, ధ్వంసం చేస్తూ వైకాపా గూండాలు వికృతానందం పొందుతున్నారు. జగన్‌రెడ్డి ప్రభుత్వ అవినీతి, అరాచకాలపై ప్రజలు ఆగ్రహించిన ప్రతిసారీ వారి దృష్టి మళ్లించేందుకు ఇలాంటి దిగజారుడు పనులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఉదాసీన వైఖరే ఇలాంటి ఘటనలకు కారణం. గతంలోనూ ఎన్టీఆర్‌ విగ్రహాలకు దుండగులు నిప్పుపెట్టడం, ధ్వంసం చేయడం లాంటి పనులు చేశారు. దాడికి కారణమైన వారిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే తెదేపా నేతలు, కార్యకర్తలపై ఆగమేఘాల మీద అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెడుతున్న పోలీసులు ఎన్టీఆర్‌ విగ్రహాలపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవడం దేనికి సంకేతం? అధికార పార్టీలకు ఒక న్యాయం, ప్రతిపక్షాలకు మరో న్యాయమా’ అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని