Janasena: జగన్‌ సీఎం అయ్యాక అసలు రంగు బయటపడింది: జానీ మాస్టర్‌

నగరంలోని టిడ్కో ఇళ్ల వద్ద జనసేన కార్యకర్తలు మహాధర్నా నిర్వహించారు. 

Updated : 10 Feb 2024 18:00 IST

నెల్లూరు: జగన్‌ ప్రభుత్వంలో పేదల సొంతింటి కల..కలగానే మిగిలిపోయిందని జనసేన నేత, ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ విమర్శించారు. నెల్లూరులోని టిడ్కో ఇళ్ల వద్ద జనసేన కార్యకర్తలు మహాధర్నా నిర్వహించారు. ఆందోళనలో పాల్గొన్న జానీ మాస్టర్ మాట్లాడుతూ... రూపాయికే ఇల్లు అని లబ్ధిదారులకు శఠగోపం పెట్టారని విమర్శించారు. టిడ్కో ఇళ్లన్నీ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయన్నారు.

గత ప్రభుత్వంలో నిర్మించిన వాటిని లబ్ధిదారులకు ఇచ్చి ఉంటే.. వారికి అద్దె ఇళ్లలో అవస్థలు తప్పేవన్నారు. అధికారంలోకి వస్తే రూపాయికే ఇల్లు ఇస్తామన్న జగన్‌.. సీఎం అయ్యాక పూర్తిగా రివర్స్‌ అయ్యారని మండిపడ్డారు. రంగులు మార్చి.. తన అసలు రంగు బయటపెట్టారని ధ్వజమెత్తారు. ఇళ్లు ఇప్పించండి మహా ప్రభో అని మొరపెట్టుకున్నా.. సిటీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ పట్టించుకోలేదన్నారు. ఆయన గ్రాఫ్‌ పడిపోవడంతో పక్క జిల్లాకు పంపేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పేదల కోసం కట్టించిన లక్ష గృహాలు వారికి ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. టిడ్కో ఇళ్లు ఇచ్చే వరకు పోరాడతానని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని