Nadendla Manohar: ఏడాదికి 40 వేల వీసాలే ఇస్తుంటే.. లక్షలాది మందికి టోఫెలెలా?: నాదెండ్ల

రాష్ట్ర ప్రభుత్వం టోఫెల్ శిక్షణ పేరుతో ఈటీఎస్‌ అనే సంస్థకు ఏటా రూ.వెయ్యి కోట్లు దోచిపెట్టడానికి సిద్ధమైందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.

Updated : 11 Oct 2023 15:49 IST

తెనాలి: రాష్ట్ర ప్రభుత్వం టోఫెల్ శిక్షణ పేరుతో ఈటీఎస్‌ అనే సంస్థకు ఏటా రూ.వెయ్యి కోట్లు దోచిపెట్టడానికి సిద్ధమైందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలిలో మీడియాతో ఆయన మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సంస్కరణల పేరిట దోచుకుంటోందని దుయ్యబట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఏడాదికి 40 వేల మందికి మాత్రమే అమెరికా వీసాలు ఇస్తుంటే.. లక్షలాది మందికి శిక్షణ ఇప్పిస్తామనటం ఎవరిని మోసం చేయడానికి అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తమ పార్టీ నేతలతో చేయించే బస్సు యాత్ర ప్రజలను మోసం చేయడానికేనని విమర్శించారు. ముఖ్యమంత్రి మాత్రం హెలికాప్టర్‌లో తిరుగుతూ ప్రతిపక్షాలను  తిట్టడం కోసం ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని