JC Prabhakar Reddy: రైతులతో కలిసి జేసీ ప్రభాకర్‌ రెడ్డి రహదారి దిగ్బంధం

పెద్దఒడుగూరు మండలం మిడ్తూరు వద్ద రైతులతో కలిసి అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి (JC Prabhakar Reddy) ఆందోళనకు దిగారు.

Updated : 20 Dec 2023 17:10 IST

అనంతపురం: పెద్దఒడుగూరు మండలం మిడ్తూరు వద్ద రైతులతో కలిసి అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి (JC Prabhakar Reddy) ఆందోళనకు దిగారు. మిడ్‌ పెన్నార్‌ రిజర్వాయర్‌ ఉత్తర కాల్వ ఆయకట్టు రైతులు, జేసీ కలిసి జాతీయ రహదారిని దిగ్బంధించారు. 50వేల ఎకరాల్లో మిర్చి, పత్తి పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఉత్తర కాల్వ కింద పెద్దఒడుగూరు, యాడికి మండలాల్లో  పంటలు ఎండుతున్నాయి. గత నెల 18న ఉత్తర కాల్వకు నీటిని  అధికారులు నిలిపివేశారు. వెంటనే ఆ కాల్వకు నీటిని విడుదల చేసి పంటలు కాపాడాలి’’ అని జేసీ ప్రభాకర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని