JC Prabhakar Reddy: దొంగ ఓట్లు చేర్చే వాళ్లను వదిలిపెట్టం: జేసీ ప్రభాకర్‌ రెడ్డి

తాడిపత్రి నియోజకవర్గంలో దొంగ ఓట్లు చేర్చే వాళ్లను వదిలిపెట్టమని మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి హెచ్చరించారు.

Updated : 10 Nov 2023 14:26 IST

తాడిపత్రి: తాడిపత్రి నియోజకవర్గంలో దొంగ ఓట్లు చేర్చే వాళ్లను వదిలిపెట్టమని మున్సిపల్‌ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి హెచ్చరించారు. అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్, డీఐజీ అమ్మిరెడ్డిలను కలిసి దీపావళి శుభాకంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. యల్లనూరు, పుట్లూరులో ఓటర్ల జాబితాలో అక్రమాలు చేస్తున్న తహసీల్దార్లు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. దొంగ ఓట్లను చేర్చితే ఎట్టి పరిస్థితుల్లో వదలనని, ఎంతవరకైనా పోతానన్నారు.

‘‘రానున్న ఎన్నికలు మాకు జీవన్మరణ పోరాటం. ఓటర్ల జాబితాలో అక్రమాలు చేస్తే.. చూస్తూ ఊరుకోం. తాడిపత్రిలో మురుగు సమస్యపై అధికారుల్లో స్పందన లేకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు. పోలీసు అధికారులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పటానికే వచ్చాను. రాజకీయాలు కానీ.. ఎవరి మీదైనా ఫిర్యాదు చేయటానికి కాదు’’ అని జేసీ ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని