రాసలీలల సీడీ వివాదం: మంత్రి రాజీనామా 

ఉద్యోగం ఇప్పిస్తానని మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జల వనరుల శాఖ మంత్రి రమేశ్‌ జర్కిహోలీ తన పదవికి రాజీనామా చేశారు

Updated : 03 Mar 2021 15:17 IST

బెంగళూరు: ఉద్యోగం ఇప్పిస్తానని మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జల వనరుల శాఖ మంత్రి రమేశ్‌ జర్కిహోలీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్పకు రాజీనామా లేఖను పంపారు. ‘‘నాపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవం. వాటిపై తక్షణమే దర్యాప్తు జరపాలి. నేను ఏ తప్పూ చేయలేదు. అయితే, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నా’’ అని రమేశ్‌ లేఖలో పేర్కొన్నారు.  

సదరు మంత్రి ఓ మహిళతో సన్నిహితంగా మెలిగిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆ మంత్రి తనను లైంగిక అవసరాలకు వాడుకున్నారని సదరు మహిళ ఆరోపించారు. ఈ వీడియో కాస్తా వివాదాస్పదం కావడంతో రమేశ్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే, దీనిపై నిన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తన చిత్రాలను ఉపయోగించి ఎవరో సీడీని రూపొందించారని ఆరోపించారు. సమగ్ర దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు వెలుగులోని వస్తాయన్నారు. దర్యాప్తును ఎదుర్కొంటానని, వెనుకంజ వేయబోనని ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని