Kodali Nani: చిరంజీవిని విమర్శించేంత సంస్కారహీనుడిని కాదు: కొడాలి నాని

ప్రముఖ సినీనటుడు చిరంజీవిని తాను విమర్శించినట్లు నిరూపించాలని మాజీ మంత్రి కొడాలి నాని సవాల్‌ విసిరారు. నేనేం మాట్లాడానో చిరంజీవి, ఆయన అభిమానులకు తెలుసని వ్యాఖ్యానించారు.

Updated : 22 Aug 2023 14:54 IST

గుడివాడ: ప్రముఖ సినీనటుడు చిరంజీవిని తాను విమర్శించినట్లు నిరూపించాలని మాజీ మంత్రి కొడాలి నాని సవాల్‌ విసిరారు. నేనేం మాట్లాడానో చిరంజీవి, ఆయన అభిమానులకు తెలుసని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తామంతా క్లారిటీగా ఉన్నామని చెప్పారు. గుడివాడలో నిర్వహించిన చిరంజీవి జన్మదిన వేడుకల్లో కొడాలి నాని పాల్గొన్నారు. కేక్‌ కట్‌ చేసి చిరు అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

‘‘ఎవరి జోలికీ వెళ్లని పెద్దాయన చిరంజీవిని విమర్శించేంత సంస్కారహీనుడిని కాదు. ఆయన అభిమానుల ముసుగులో తెదేపా, జనసేన శ్రేణులు గుడివాడ రోడ్లపై దొర్లారు. చిరంజీవి, మాకు మధ్య అగాధం సృష్టించాలని కుట్రలు చేస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ ప్రచార సమయంలో గుడివాడలోని నా కార్యాలయం మీదుగా ఆయన వెళ్తే చేతులెత్తి నమస్కరించాను. చిరంజీవిని అనేక సందర్భాల్లో నేను కలిశాను. పెద్దాయనగా ఆయన చెప్పే సూచనలు పాటిస్తాం. డ్యాన్సులు, నటన చేతకాని వాళ్లకు చిరంజీవి సలహాలు ఇవ్వాలనే చెప్పాను. నా వెంట ఉన్న వ్యక్తుల్లో 60 శాతం మంది చిరంజీవి అభిమానులే’’ అని కొడాలి నాని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని