Botsa Satyanarayana: మద్యం ధరలు పెంచితే ప్రతిపక్షాలకు ఉలుకెందుకు?: మంత్రి బొత్స

వైకాపా పాలనలో జరిగిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించేందుకు సామాజిక న్యాయ బస్సు యాత్ర చేపట్టామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Published : 22 Oct 2023 12:41 IST

విశాఖపట్నం: వైకాపా పాలనలో జరిగిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించేందుకు సామాజిక న్యాయ బస్సు యాత్ర చేపట్టామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖ గ్రాండ్‌వేలో వైకాపా ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి బొత్స పాల్గొన్నారు. మొదటి దశగా 12రోజుల పాటు సామాజిక న్యాయ బస్సు యాత్ర కొనసాగుతుందని తెలిపారు. 

‘‘నవరత్నాల్లో భాగంగానే దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తున్నాం. మద్యం ధరలు పెంచితే ప్రతిపక్షాలకు ఉలుకెందుకు? డబ్బు మదంతో ఉన్న వాళ్లే మద్యం జోలికి వెళ్తారు. ఖరీదైన మద్యం పేదలకు దూరంగానే ఉంటుంది. నూతన విద్యా విధానంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలియకుండా మాట్లాడుతున్నారు. బైజూస్‌ కంటెంట్‌ కోసం విద్యార్థులు, ప్రభుత్వం ఎటువంటి ఖర్చు చేయటం లేదు. దీని గురించి ఎన్నిసార్లు చెప్పినా కుంభకోణాలు అని అంటున్న పవన్‌కు తెలియకపోతే.. నా వద్దకు వస్తే ట్యూషన్‌ చెబుతాను’’ అని బొత్స వ్యాఖ్యానించారు. 

‘‘శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ఈనెల 26న సామాజిక న్యాయ బస్సు యాత్రను ప్రారంభిస్తాం. ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభలు నిర్వహిస్తాం’’ అని సుబ్బారెడ్డి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని