KTR: పదివేల డబుల్‌ బెడ్ రూమ్‌ ఇళ్లు వారికే కేటాయిద్దాం: మంత్రి కేటీఆర్‌

పదివేలకు పైగా రెండు పడక గదుల ఇళ్లను మూసీనది ఒడ్డున దుర్భర పరిస్థితుల్లో నివసిస్తున్న పేద ప్రజలకు అందించి, మూసీపై ఆక్రమణలు తొలగించేలా చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.

Published : 17 Aug 2023 19:12 IST

హైదరాబాద్‌: మహానగరంలో ప్రభుత్వం నిర్మించిన పదివేలకు పైగా రెండు పడక గదుల ఇళ్లను మూసీనది ఒడ్డున దుర్భర పరిస్థితుల్లో నివసిస్తున్న పేద ప్రజలకు అందించి, మూసీపై ఆక్రమణలు తొలగించేలా చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. అత్యంత పేదరికం వల్ల మూసీనది పక్కన దుర్భరమైన స్థితిలో జీవంన సాగిస్తు్న్న వీరందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు గొప్ప ఉపశమనం కలిగిస్తాయని మంత్రి తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశమైన మంత్రి కేటీఆర్‌ .. హైదరాబాద్‌ నగర అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై విస్తృతంగా చర్చించారు.

రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ నగరం కోసం పత్ర్యేకంగా చేస్తోన్న అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికపై ఈ సమావేశంలో ఎమ్మెల్యేలంతా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. నగరంలో వరద నివారణ కోసం చేపట్టిన ప్రభుత్వం చేపట్టిన ఎస్‌ఎన్‌డీపీ కార్యక్రమంలో మంచి ఫలితాలు ఇచ్చిందన్నారు. గతంలో భారీ వర్షాలకు మునిగిపోయిన అనేక ప్రాంతాలు.. ఈ ఏడాది భారీ వర్షాలు కురిసినా వరద ముంపు నుంచి తప్పించుకున్నాయని తెలిపారు.

మూసీ వెంట వరదకు అడ్డంకిగా ఉన్న నిర్మాణాలను తొలగిస్తే.. తర్వాత మూసీ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఇప్పటకే మూసీ ప్రాజెక్టు అభివృద్ది కోసం ప్రాథమిక ప్రణాళికను ప్రభుత్వం పూర్తి చేసిందని మంత్రి వివరించారు. హైదరాబాద్ నగరంలో గత పదేళ్లలో జరిగిన విస్తృతమైన అభివృద్ధి పట్ల ప్రజలు అత్యంత సంతృప్తిగా ఉన్నారన్న నివేదికలు తమకు ఉన్నాయని మంత్రి కేటీఆర్ ఈ సమావేశంలో తెలిపారు. తమ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లి, రానున్న ఎన్నికల్లో ప్రజల మద్దతు అడగాలని ఈ సందర్భంగా కేటీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని