MLC Kasireddy: భారాసకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి భారాసకు రాజీనామా చేశారు. 

Updated : 01 Oct 2023 12:32 IST

హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి భారాసకు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీల హామీతో పేదలకు మేలు జరుగుతుందని.. అందుకే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కసిరెడ్డి తెలిపారు.

ఆదివారం ఉదయమే టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌తో కసిరెడ్డి భేటీ అయిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. నాగర్‌కర్నూల్‌ జడ్పీ వైస్‌ఛైర్మన్‌ బాలాజీ సింగ్‌ కూడా భారాసకు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మెదక్‌ డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు