Kavitha: గులాబీ కండువా కప్పుకున్నందుకు గర్వపడుతున్నాం: ఎమ్మెల్సీ కవిత
గత 22 ఏళ్లుగా ప్రజల కోసమే భారాస పనిచేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అనేక మంది కార్యకర్తలు పార్టీ కోసం జీవితాలను త్యాగం చేశారని కొనియాడారు. మక్లూర్‌లో నిర్వహించిన భారాస ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మల్లారెడ్డితో కలిసి కవిత పాల్గొన్నారు.
నిజామాబాద్: గత 22 ఏళ్లుగా ప్రజల కోసమే భారాస పనిచేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అనేక మంది కార్యకర్తలు పార్టీ కోసం జీవితాలను త్యాగం చేశారని కొనియాడారు. మక్లూర్‌లో నిర్వహించిన భారాస ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మల్లారెడ్డితో కలిసి కవిత పాల్గొన్నారు. ఒకప్పుడు గులాబీ కండువా కప్పుకుంటే ఎగతాళి చేసేవారని. కానీ, ఇప్పుడు గులాబీ కండువా కప్పుకున్నందుకు గర్వపడుతున్నామన్నారు. కార్యకర్తల త్యాగఫలమే కాళేశ్వరం జలాలు అని కవిత పేర్కొన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. కర్ణాటక ఎన్నికల్లో భాజపా పని అయిపోయిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంతో ఉన్నారన్నారు. భాజపా పాలిత రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం మోడల్‌గా మారిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Siddharth: దానివల్ల మా సినిమాకు ఎంతో నష్టం.. ప్రెస్‌మీట్ అడ్డుకోవడంపై సిద్ధార్థ్
-
World Culture Festival : మానసిక అనారోగ్యం అనేది అతి పెద్ద సమస్య : శ్రీశ్రీ రవిశంకర్
-
Vizag: విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పెట్టె.. అందులో ఏముందో?
-
Jaishankar: ఆధారాలుంటే చూపించండి.. చూస్తాం: కెనడాను కడిగేసిన జైశంకర్
-
Guntur: గుంటూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం
-
Biden-Trump: బైడెన్‌కు దారి దొరకడం లేదు.. అధ్యక్షుడి ఫిట్‌నెస్‌పై ట్రంప్ ఎద్దేవా