MLC Kavitha: బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలేవీ?: కేంద్రాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత

దిల్లీలో రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్దతు ప్రకటించారు. రెజ్లర్లను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు.

Updated : 31 May 2023 14:56 IST

హైదరాబాద్‌: దిల్లీలో రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్దతు ప్రకటించారు. రెజ్లర్లను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై రెజ్లర్లు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. 

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి రెజ్లర్లు లేవనెత్తుతున్న అంశాలను పరిగణనలోకి తీసుకుని తగిన పరిష్కారం చూపాలని కవిత డిమాండ్‌ చేశారు. దేశానికి బంగారు పతకాలు సాధించిన క్రీడాకారుల పట్ల అనుచితంగా వ్యవహరించడం తగదన్నారు. ఈ వ్యవహారాన్ని ప్రపంచమంతా చూస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి దేశ ప్రజలు సమాధానం కోరుకుంటున్నారని కవిత అన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు