Kavitha: మహిళలు ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగానే మిగిలిపోవాలా?: ఎమ్మెల్సీ కవిత

పదేళ్లుగా పూర్తి మెజార్టీతో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్‌ మహిళా బిల్లును ఎందుకు ఆమోదించలేదని భారాస ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఇప్పటికీ పార్లమెంట్‌లో మహిశా సభ్యులు కేవలం 12 శాతమేనని చెప్పారు.

Updated : 23 Aug 2023 13:35 IST

హైదరాబాద్: పదేళ్లుగా పూర్తి మెజార్టీతో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్‌ మహిళా బిల్లును ఎందుకు ఆమోదించలేదని భారాస ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఇప్పటికీ పార్లమెంట్‌లో మహిశా సభ్యులు కేవలం 12 శాతమేనని చెప్పారు. తొలి లోక్‌సభలో 8 శాతం మహిళా ఎంపీలు ఉంటే ఇప్పుడు 12శాతం మంది ఉన్నారన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు.

‘‘మణిపుర్‌లో ఇప్పుడు ఇద్దరు మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మహిళలు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగానే మిగిలిపోవాలా? 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా బిల్లు 2023 వచ్చినా ఎందుకు ఆమోదం పొందలేదు’’ అని కవిత ప్రశ్నించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని