Vijayawada: అలాంటి వారికి టికెట్లిస్తే సహకరించను.. తెదేపా పూర్తిగా ప్రక్షాళన కావాలనే..: ఎంపీ కేశినేని

తన సోదరుడు కేశినేని శివనాథ్‌కు ఎంపీ టికెటిస్తే సహకరించబోనని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) స్పష్టం చేశారు.

Updated : 17 Jan 2023 12:39 IST

నందిగామ, న్యూస్‌టుడే: తన సోదరుడు కేశినేని శివనాథ్‌కు ఎంపీ టికెటిస్తే సహకరించబోనని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) స్పష్టం చేశారు. ఆయనతోపాటు మరో ఇద్దరు, ముగ్గురికి టికెట్లిచ్చినా మద్దతు ఇవ్వబోనని తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలో పని చేసేందుకు, పోటీ చేసేందుకు అవకాశం ఉందని, క్రిమినల్స్‌, ల్యాండ్‌, సెక్స్‌ మాఫియాలకు టికెట్లిస్తే సహకరించబోనని చెప్పారు. తెదేపా పూర్తిగా ప్రక్షాళన కావాలనే ఉద్దేశంతోనే తానున్నట్లు తెలిపారు. ఈ నియోజకవర్గంలో కేశినేని శివనాథ్‌ చురుగ్గా పని చేస్తున్నారని, ఎంపీ నాని లేరనే విషయాన్ని ప్రస్తావించగా... చురుగ్గా ఉంటే మంచిదేగా అని వ్యాఖ్యానించారు. ఈ సారి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారా? అని అడగ్గా.. ఎవరు చెప్పారని ఎదురు ప్రశ్న వేశారు. తన సేవలు ఎక్కడ అవసరమో అక్కడ అధిష్ఠానం వాడుకుంటుందని చెప్పారు. ఎంపీ కాకపోయినా టాటా ట్రస్టు లాంటివి మరో 100 తీసుకొచ్చి ప్రజా సేవ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు