MP Komaireddy: 50ఏళ్లలో కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసిందో సీఎం కేసీఆర్‌కు తెలియదా?: ఎంపీ కోమటిరెడ్డి

50ఏళ్లలో కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసిందో సీఎం కేసీఆర్‌కు తెలియదా? అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. 

Published : 22 Aug 2023 18:11 IST

హైదరాబాద్‌: 50ఏళ్లలో కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసిందో సీఎం కేసీఆర్‌కు తెలియదా? అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkata Reddy) ప్రశ్నించారు. సూర్యాపేట సభలో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలతో పాటు, భారాస మొదటి విడత అభ్యర్థుల జాబితాపై వెంకటరెడ్డి స్పందించారు. కేసీఆర్‌ రాజకీయ జీవితం మొదలైంది కాంగ్రెస్‌ పార్టీ నుంచేనని, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నిర్మించింది కాంగ్రెస్‌ హయాంలోనే అని కేసీఆర్‌కు తెలియదా అని ఎద్దేవా చేశారు. 

కర్ణాటకలోని కూర్గ్‌లో జరుగుతున్న బొగ్గు గనులు, ఉక్కు ఆధారిత పరిశోధన కోసం ఏర్పాటు చేసిన పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ స్టడీ టూర్‌లో కోమటిరెడ్డి మాట్లాడారు. గత 50ఏళ్లలో కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధిని ఆయన వివరించారు.  కేసీఆర్‌ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల ఆస్తులు.. ఎమ్మెల్యేలు కాకముందు ఎంత, అయ్యాక ఎంత పెరిగిందనే వివరాలు సేకరించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయాలని కార్యకర్తలు, ఉద్యమకారులు, నిరుద్యోగులకు పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని