nagababu: మెగా డీఎస్సీ పేరుతో వైకాపా మోసం: నాగబాబు

మెగా డీఎస్సీ పేరుతో వైకాపా ప్రభుత్వం యువతను మోసం చేస్తోందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు.

Updated : 05 Feb 2024 20:07 IST

అమరావతి: మెగా డీఎస్సీ పేరుతో వైకాపా ప్రభుత్వం యువతను మోసం చేస్తోందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు. రాష్ట్రంలో 25వేల నుంచి 30వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే.. కేవలం 6,100 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని చెప్పడం దారుణమన్నారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి వచ్చిన డీఎస్సీ అభ్యర్థులతో ఆయన మాట్లాడారు. ఎన్నికల వేళ తమను మరోసారి మోసం చేసేందుకు వైకాపా ప్రభుత్వం యత్నిస్తోందని అభ్యర్థులు వివరించారు.

అనంతరం నాగబాబు మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాదయాత్ర సమయంలో 23వేల పోస్టులతో మెగా డీఎస్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో తమ జీవితాలు మారిపోతాయని లక్షలాది మంది నిరుద్యోగులు వైకాపాకు ఓట్లు వేసి గెలిపించారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరేళ్లు దాటుతున్నా ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయారు. రోజు రోజుకూ నిరుద్యోగుల్లో ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. డీఎస్సీ అభ్యర్థులకు మా పార్టీ అండగా ఉంటుంది. జనసేన-తెదేపా ప్రభుత్వంలో వీరికి తప్పకుండా న్యాయం చేస్తాం’’ అని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని