Nara Lokesh: నన్ను ఓడించేందుకు వైకాపా రూ.300 కోట్లు ఖర్చు చేస్తోంది: లోకేశ్‌

తెదేపా అధికారంలోకి రాగానే వాలంటీర్లతోనే సంక్షేమ పథకాలు పంపిణీ చేయిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలిపారు.

Published : 23 Mar 2024 22:46 IST

అమరావతి: తెదేపా అధికారంలోకి రాగానే వాలంటీర్లతోనే సంక్షేమ పథకాలు పంపిణీ చేయిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలిపారు. ఏయే లబ్ధిదారులు ఎలాంటి సంక్షేమ పథకాలు అందుకుంటున్నారో.. అవన్నీ అలాగే కొనసాగుతాయని తాడేపల్లిలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో చెప్పారు. తాడేపల్లి ఎన్టీఆర్ కట్ట, పాతూరు, మల్లంపూడి గ్రామాల్లో శనివారం రాత్రి ఆయన రచ్చబండ నిర్వహించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గంజాయిని నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్‌ కట్టపై ఉంటున్న వారి ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరిస్తామన్నారు.

మంగళగిరిలో తనను ఓడించేందుకు వైకాపా రూ.300 కోట్లు ఖర్చు చేస్తోందని ఆరోపించారు. రూ.కోట్లు కుమ్మరించి తనను ఓడించాలని చూస్తున్నారని.. అయినా ప్రజలే తెదేపాను గెలిపిస్తారని లోకేశ్‌ ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని