Nara Lokesh: లోకేశ్‌ చేతిలో మైక్‌ లాక్కునేందుకు పోలీసుల యత్నం.. పాదయాత్రలో ఉద్రిక్తత

చిత్తూరు జిల్లాలో కొనసాగుతోన్న నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా సభ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో లోకేశ్‌ పోలీసులపై ధ్వజమెత్తారు.

Updated : 08 Feb 2023 17:23 IST

చిత్తూరు: నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా ఎన్‌ఆర్‌పేట ఎన్టీఆర్‌ కూడలిలో సభ నిర్వహణకు అనుమతి లేదంటూ లోకేశ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. జీవో-1 ప్రకారం రోడ్లపై సమావేశానికి అనుమతి లేదని చెప్పడంతో తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అనంతరం ఎన్టీఆర్‌ కూడలిలోనే తనను కలవడానికి వచ్చిన ప్రజల్ని ఉద్దేశించి లోకేశ్‌ మాట్లాడారు. ‘సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వకపోతే ఎక్కడ పెట్టాలి. తాడేపల్లి ప్యాలెస్‌లో పెట్టుకోవాలా?’ అని పోలీసులను ప్రశ్నించారు. ఈ క్రమంలో లోకేశ్‌ చేతిలో మైకు లాక్కోవడానికి పోలీసులు యత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. లోకేశ్‌ పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా అడ్డుపడుతున్నారని, నిబంధనల పేరుతో వేధిస్తున్నారని తెదేపా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని