Raghav Chadha: అగ్నివీరుల సేవలకు గుర్తింపు దక్కడం లేదు: ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా

పంజాబ్‌ (Punjab) రాష్ట్రానికి చెందిన ‘అగ్నివీర్’ అమృత్‌పాల్‌ సింగ్‌(20) ఇటీవల విధులు నిర్వహిస్తూ మృతిచెందారు. ఆయనకు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించకపోవడాన్ని ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా (Raghav Chadha) తప్పుపట్టారు. 

Updated : 15 Oct 2023 18:54 IST

దిల్లీ: ‘అగ్నివీర్‌’గా విధులు నిర్వహిస్తూ ఇటీవల మృతిచెందిన సైనికుడు అమృత్‌పాల్‌ సింగ్‌కు మిలటరీ నియమాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించకపోవడంపై ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా (Raghav Chadha) అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌’ను వర్తింపజేయకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ‘అమరవీరుడు, అగ్నివీర్‌ అమృత్‌పాల్‌ సింగ్‌ మృతదేహాన్ని పంజాబ్‌లోని (Punjab) అతడి స్వగ్రామం కోట్లి కల్లాన్‌ తీసుకొచ్చారు. సైన్యానికి సంబంధించిన వ్యక్తులు ఆ భౌతికకాయం వెంట రాలేదు. ఒక ప్రైవేటు అంబులెన్సులో ఇక్కడికి చేర్చారు. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే.. అంత్యక్రియల సమయంలో ‘గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌’ ప్రక్రియ చేపట్టలేదని’ రాఘవ్‌ చద్దా విమర్శించారు. 

పేదలకు ‘కేసీఆర్‌ బీమా’.. ఆసరా పింఛన్లు ₹5వేలకు పెంపు.. ₹400లకే గ్యాస్‌ సిలిండర్‌!

రాజకీయ నాయకులు చనిపోతే సంతాప దినాలు పాటిస్తున్నారు, స్మారక చిహ్నాలు నిర్మిస్తున్నారు కానీ, అగ్నివీరులకు ఎలాంటి గౌరవం దక్కడం లేదని ఆయన ఆక్షేపించారు. అగ్నివీరులకు గ్రాట్యుటీ, పెన్షన్‌ ప్రయోజనాలు ఇవ్వడంలేదని అన్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల పంజాబ్ సీఎం భగవంత్‌ మాన్‌ మాట్లాడుతూ అగ్నీవీరుడి మృతిపట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదని అన్నారు. ఆర్మీ విధానంతో సంబంధంలేకుండా పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం మృతుడి కుటుంబానికి రూ.1కోటి నష్టపరిహారం చెల్లిస్తుందని ప్రకటించారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని