Pawan: జనసేనకు విరాళాల పేరుతో చెక్కులు.. వెనక్కి పంపాలని పవన్‌ ఆదేశం

ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీట్ల కోసం ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

Published : 06 Feb 2024 19:47 IST

అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీట్ల కోసం ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పలువురు నేతలు జనసేన పార్టీకి చెక్కుల రూపంలో విరాళాలు అందించారు. ఆ తర్వాత టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీలో చేరకుండానే డొనేషన్లు ఇవ్వడంపై అధినేత పవన్‌ కల్యాణ్‌ సందేహించారు. పరిస్థితి సమీక్షించి వెంటనే అప్రమత్తమయ్యారు. జనసేనను దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. సీట్లు అడిగిన ప్రముఖుల చెక్కులను వెంటనే వెనక్కి పంపాలని పవన్‌ ఆదేశించినట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని