Daggubati Purandeswari: పవన్‌ వ్యాఖ్యలను తప్పుగా చూడట్లేదు: పురందేశ్వరి

జనసేన తమ పార్టీతో పొత్తులోనే ఉందని భాజపా ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

Updated : 17 Sep 2023 13:53 IST

విజయవాడ: జనసేన తమ పార్టీతో పొత్తులోనే ఉందని భాజపా ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీ జన్మదినోత్సవం సందర్భంగా విజయవాడలోని కోమల విలాస్ సెంటర్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి ముఖ్యఅతిథిగా హాజరై పేదలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు.

తెదేపా, జనసేన పొత్తు సూపర్‌ హిట్‌

‘‘పొత్తులపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను మేం తప్పుగా చూడట్లేదు. భాజపా అధిష్ఠానానికి అన్నీ వివరిస్తానని పవన్‌ చెప్పారు. కేంద్ర పెద్దలతో చర్చించాక మా అభిప్రాయాలు చెబుతాం. పొత్తుల విషయం అధినాయకత్వమే చూసుకుంటుంది. చంద్రబాబు అరెస్టు విధానాన్ని తొలుత భాజపానే తప్పుపట్టింది. ఏపీ, తెలంగాణ భాజపా నేతలు ఈ అరెస్టును ఖండించారు. చంద్రబాబు అరెస్టు వెనుక భాజపా ఉందనేది అసత్య ప్రచారం. సీఐడీ ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తుంది’’ అని పురందేశ్వరి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని