Devendra Fadnavis: లోక్‌సభ ఎన్నికలపై దేవేంద్ర ఫడణవీస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీకి ఓటు వేయాలని ప్రజలు నిశ్చయంతో ఉన్నారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు.

Published : 25 Dec 2023 18:55 IST

పుణె: వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి భాజపా సీనియర్‌ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)కి ఓటు వేయాలని ప్రజలు నిశ్చయంతో ఉన్నారని అభిప్రాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో భాజపాకు కొన్ని సీట్లు తగ్గుతాయని.. విపక్షాలు మెరుగైన ఫలితాలు సాధిస్తాయంటూ ఓ సర్వే పేర్కొనడంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఫడణవీస్‌ స్పందించారు. ‘‘ప్రస్తుతం కేవలం మోదీ హవా మాత్రమే ఉందన్నారు. మోదీజీకే ఓటు వేయాలని ప్రజలు నిశ్చియించుకున్నారు. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ సీట్లకు గాను మేం 40 లోక్‌సభ సీట్లు గెలుచుకుంటాం’’ అని ఫడణవీస్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. 

వైకాపా నుంచి పోటీ చేసి గెలవకపోవడమే మంచిదైంది:

మరోవైపు, సోమవారం ఆయన ముంబయిలోని తన అధికారిక నివాసంలో భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పుణె  పర్యటనకు బయల్దేరి వెళ్లారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని