Congress MLA: డ్రగ్స్‌ అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అరెస్ట్‌

డ్రగ్స్‌ అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ అరెస్టు ఆప్‌-కాంగ్రెస్‌ల మధ్య బంధాన్ని ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Published : 28 Sep 2023 13:03 IST

చండీగఢ్‌: డ్రగ్స్‌ అక్రమ రవాణా, మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్‌ (Congress) ఎమ్మెల్యే సుఖ్‌పాల్‌ సింగ్‌ ఖైరాను పంజాబ్‌ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఉదయం ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టిన పంజాబ్‌ పోలీసులు.. సుఖ్‌పాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. 2015లో ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద జలాదాబాద్‌, ఫజిల్కాలో సుఖ్‌పాల్‌పై కేసులు నమోదయ్యాయి. అంతర్జాతీయ డ్రగ్‌ ముఠాలకు సాయం చేయడంతో పాటు, వారికి ఆశ్రయం కల్పించి ఆర్థికంగా లబ్ధి పొందాడని పోలీసులు ఛార్జీషీట్‌లో పేర్కొన్నారు. 

2014-20 మధ్య కాలంలో సుఖ్‌పాల్‌ ఆదాయానికి మించి ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఈ అరెస్టు ఆప్‌-కాంగ్రెస్‌ మధ్య సంబంధాలను మరింత దెబ్బ తీస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇండియా కూటమిలో ఇరు పార్టీలు భాగస్వాములుగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అరెస్టు చర్చనీయాంశమైంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌తో సీట్ల పంపకాన్ని పంజాబ్‌ కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని