ఈ వేళ నా మనసంతా వారిపైనే: రాహుల్‌ గాంధీ

నూతన సంవత్సరం నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులను గుర్తుచేసుకున్నారు. తన మనసంతా వారిపైనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.........

Published : 01 Jan 2021 20:18 IST

దిల్లీ: నూతన సంవత్సరం నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులను గుర్తుచేసుకున్నారు. తన మనసంతా వారిపైనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నూతన సంవత్సరం ప్రారంభమైన వేళ.. మనం కోల్పోయిన.. మనల్ని రక్షిస్తున్న.. మన కోసం త్యాగాలు చేస్తున్నవారిని గుర్తుచేసుకుందాం. మరోవైపు నా మనసంతా.. గౌరవంతో, హందాగా అధర్మ శక్తులపై పోరాటం చేస్తున్న రైతులు, శ్రామికులపైనే ఉంది’’ అంటూనే  ప్రతిఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

కొత్త సాగు చట్టాల రద్దే లక్ష్యంగా దిల్లీ సరిహద్దుల్లో పంజాబ్‌, హరియాణాతో పాటు పలు ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వీరికి కాంగ్రెస్‌ పార్టీ తొలి నుంచి మద్దతుగా నిలుస్తోంది. వీరి డిమాండ్లను నెరవేర్చాలంటూ రాహుల్‌ నేతృత్వంలోని బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కి లేఖ కూడా సమర్పించింది.

ఇవీ చదవండి..

పెద్దలకు రుణమాఫీ బదులు పేదలకు ఇవ్వండి : రాహుల్‌

న్యూఇయర్‌ వేళ.. నిమిషానికి 4100 ఫుడ్‌ ఆర్డర్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని