Rajya Sabha: రాజ్యసభకు సోనియా, నడ్డా.. ఏకగ్రీవ ఎన్నిక

Rajya Sabha: కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ రాజస్థాన్‌ నుంచి, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గుజరాత్‌ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Published : 20 Feb 2024 17:33 IST

దిల్లీ: పాతికేళ్ల పాటు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్‌ (Congress) అగ్ర నాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) ఇప్పుడు పెద్దల సభలోకి అడుగుపెట్టబోతున్నారు. రాజస్థాన్‌ నుంచి ఆమె రాజ్యసభ (Rajya Sabha)కు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అటు భాజపా (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) కూడా గుజరాత్‌ నుంచి ఎలాంటి పోటీ లేకుండానే ఎగువ సభకు ఎన్నికయ్యారు.

రాజ్యసభలో ఏర్పడిన ఖాళీల భర్తీకి ఎన్నికల ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారంతో గడువు ముగిసింది. రాజస్థాన్‌ నుంచి ఖాళీ కానున్న మూడు స్థానాలకు కాంగ్రెస్‌ నుంచి సోనియాగాంధీ, భాజపా నుంచి చున్నిలాల్‌ గరాసియా, మదన్‌రాథోడ్‌ నామినేషన్‌ వేశారు. పోటీలో ఇంకెవరూ లేకపోవడంతో ఈ ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి వెల్లడించారు. ఈ రాష్ట్రంలో మొత్తం 10 రాజ్యసభ స్థానాలుండగా.. తాజా ఫలితాలతో కాంగ్రెస్‌కు ఆరు, భాజపాకు నలుగురు సభ్యులున్నారు.

చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికపై సంచలన తీర్పు.. ఆప్‌ అభ్యర్థిని విజేతగా ప్రకటించిన సుప్రీం

అటు గుజరాత్‌లో ఖాళీ కానున్న నాలుగు స్థానాల్లో నడ్డా సహా అధికార భాజపాకు చెందిన నలుగురు పోటీకి దిగారు. ఇంకెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. 2012, 2018లో నడ్డా హిమాచల్‌ ప్రదేశ్ నుంచి ఎగువసభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం అక్కడ భాజపాకు తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో పార్టీ ఆయనను గుజరాత్‌కు మార్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు