TDP: అభ్యర్థిని పెడదామా? వద్దా?.. రాజ్యసభ ఎన్నికపై చంద్రబాబు కసరత్తు

రాజ్యసభ ఎన్నికకు అభ్యర్థిని పెడదామా?.. వద్దా? అనే అంశంపై తెదేపా అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. 

Published : 13 Feb 2024 19:48 IST

అమరావతి: రాజ్యసభ ఎన్నికకు అభ్యర్థిని పెడదామా?.. వద్దా? అనే అంశంపై తెదేపా అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి అమరావతి చేరుకున్న ఆయన పార్టీ నేతలతో సమాలోచనలు జరిపారు. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎల్లుండితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. అభ్యర్థిని నిలబెడితే మద్దతిస్తామని వైకాపా అసంతృప్త ఎమ్మెల్యేలు తెదేపా నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. వారి జాబితా భారీగానే ఉన్నట్టు వివరాలు అందజేస్తున్నారు. 

గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంతో తెదేపా ఎమ్మెల్యేల బలం 22కు చేరగా.. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు కోసం గంటా న్యాయపోరాటం చేస్తున్నారు. ఒక రాజ్యసభ అభ్యర్థి గెలుపు కోసం దాదాపు 44 మంది ఎమ్మెల్యేల మొదటి ప్రాధాన్యం ఓట్లు అవసరం. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఖాళీలకు పోలింగ్‌ జరగనుంది. వైకాపా 3 స్థానాలకు ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించగా.. ఆ పార్టీ తరఫున వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబూరావు నామినేషన్‌ దాఖలు చేశారు. వైకాపా అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో వారు నిమగ్నమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని