AP News: జంగారెడ్డి గూడెం కల్తీసారా మరణాలకు జగన్‌దే బాధ్యత: తెదేపా

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలన్నీ సీఎం జగన్ చేసిన హత్యలేనని తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విమర్శించారు.

Updated : 14 Mar 2022 11:28 IST

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలన్నీ సీఎం జగన్ చేసిన హత్యలేనని తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విమర్శించారు. బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి శాసనసభ వరకు మద్యం సీసాలను పట్టుకుని తెదేపా నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులు పట్టుకుంటూ ర్యాలీగా వెళ్లారు. నకిలీ బ్రాండ్ల బాగోతం వెలికితీయాలని డిమాండ్‌ చేశారు. మద్యపాన నిషేధం హామీ ఏమైందని ప్రశ్నించారు.

జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాల్ని సహజ మరణాలుగా చిత్రీకరించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని నేతలు దుయ్యబట్టారు. కల్తీసారా అరికట్టి రాష్ట్రంలో మద్యనిషేధం అమలు చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదన్నారు. జంగారెడ్డిగూడెంలో కల్తీసారాతో చనిపోయింది 25 మందేనని.. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వందలమంది మరణించారని నేతలు ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని