CM KCR : అవసరమైతే జాతీయపార్టీ పెడతా!: సీఎం కేసీఆర్‌

 తెరాస మంత్రులు, నేతలతో సీఎం కేసీఆర్‌ ఐదు గంటలపాటు జరిపిన సమావేశం ముగిసింది. రాష్ట్రం పట్ల

Updated : 11 Jun 2022 00:10 IST

హైదరాబాద్‌:  తెరాస మంత్రులు, నేతలతో సీఎం కేసీఆర్‌ ఐదు గంటలపాటు జరిపిన సమావేశం  ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరిపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఉద్దేశపూర్వకంగానే కేంద్రం తెలంగాణను ఇబ్బందులు పెడుతోందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పథకాలకు ఇతర రాష్ట్రాల్లోనూ మంచి స్పందన వస్తోందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల్లో మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జాతీయ స్థాయిలో రాజకీయ శూన్యత ఉందని నేతలు పేర్కొన్నారు. దేశానికి తెలంగాణ నమూనా అవసరమని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో తెరాస క్రియాశీలకం కావాలని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తెరాస నేతలు జాతీయ పార్టీకి మొగ్గు చూపారు. అవసరమైన జాతీయ పార్టీ పెడతానని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్రపతి ఎన్నికల్లో తెరాస పాత్ర తగినవిధంగా ఉంటుందని కేసీఆర్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూనే దేశం కోసం పనిచేస్తానని కేసీఆర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని