TS News: ఎందుకో రెండేళ్లకోసారి హుజూరాబాద్‌లో యుద్ధం చేయాల్సి వస్తోంది: ఈటల

తెరాస బీఫాంతోనే తాను గెలిస్తే మిగతా వాళ్లు ఎందుకు ఓడిపోయారని భాజపా నేత ఈటల ప్రశ్నించారు.

Updated : 24 Jul 2021 16:33 IST

హుజూరాబాద్‌: తెరాస బీఫాంతోనే తాను గెలిస్తే మిగతా వాళ్లు ఎందుకు ఓడిపోయారని భాజపా నేత ఈటల ప్రశ్నించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఆరో రోజు పాదయాత్ర కొనసాగించిన ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎందుకో రెండేళ్లకోసారి హుజూరాబాద్‌లో యుద్ధం చేయాల్సి వస్తోంది. 2008, 2010లో రాజీనామా చేస్తే గొప్ప మెజార్టీతో గెలిపించారు. ఆనాడు ప్రజలే నాకు ఎన్నికల కోసం డబ్బులిచ్చారు. ఆరుసార్లు గెలిచినా నేను ధర్మంగానే గెలిచా. నాకు కుడి, ఎడమ ఎవరూ ఉండకూడదని చూస్తున్నారు. మీరు డబ్బు, అధికారాన్ని నమ్ముకుంటే.. నేను ప్రజలను నమ్ముకున్నా. 2023లో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరబోతోంది’’ అని ఈటల అన్నారు.

దళిత బంధు తరహా పథకం తెలంగాణ రాష్ట్రమంతా అమలు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. ఈటల పాదయాత్ర కొనసాగుతుండగా సంజయ్‌ అందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఏ ఎన్నికలొచ్చినా హామీలివ్వడం కేసీఆర్‌కు అలవాటు. దళితబంధు కొందరికే ఇచ్చి మోసం చేసే కుట్ర చేస్తున్నారు. రూ.10 లక్షలు అన్ని వర్గాల పేదలకు ఇవ్వాలి. భాజపా అధికారంలోకి వచ్చాక భాగ్యనగరంలో అంబేడ్కర్‌ విగ్రహం పెడతాం’’ అని సంజయ్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు