KTR: కేటీఆర్‌ను కలిసిన డీఎంకే ఎంపీలు

తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఎంపీలు మంత్రి కేటీ రామారావును తెలంగాణ భవన్‌లో కలిశారు. నీట్ రద్దుకు డిమాండ్‌ చేయాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌ సీఎం కేసీఆర్‌కు ..

Updated : 13 Oct 2021 14:47 IST

హైదరాబాద్: తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఎంపీలు మంత్రి కేటీ రామారావును తెలంగాణ భవన్‌లో కలిశారు. నీట్ రద్దుకు డిమాండ్‌ చేయాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌ సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖను ఈ సందర్భంగా వారు ఆయనకు అందజేశారు. నీట్‌ రద్దుకు మద్దతు తెలపాలని కోరుతూ స్టాలిన్‌ ఇటీవల 12 రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసిన విషయం తెలిసిందే. కేటీఆర్‌ను కలిసిన వారిలో ఎంపీలు ఇళంగోవన్‌, కళానిధి వీరస్వామి తదితరులున్నారు. ఈ సందర్భంగా ఇళంగోవన్‌ మీడియాతో మాట్లాడుతూ.. నీట్‌ పరీక్ష రద్దు అంశంపై కేటీఆర్‌ను కలిసినట్లు తెలిపారు.

‘‘విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని నీట్‌ పరీక్ష రద్దు చేయాలని మేము కోరుతున్నాం. కేంద్ర విధానంపై నిరసన తెలుపుతున్నాం. మాకు మద్దతు ఇవ్వాలని కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కోరాం. కేంద్ర ప్రభుత్వం కీలకమైన విషయాల్లో రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవడం లేదు. కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారు’’ అని ఎంపీ ఇళంగోవన్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని