Revanth Reddy: ఆ అధికారులను గుర్తు పెట్టుకుంటాం.. చర్యలు తప్పవ్‌: రేవంత్‌

తనకు అదనపు భద్రత కల్పించాలని కోర్టు చెప్పిందని.. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు...

Updated : 12 Oct 2022 15:34 IST

హైదరాబాద్‌: తనకు అదనపు భద్రత కల్పించాలని కోర్టు చెప్పిందని.. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తన ఇంటిపై తెరాస కార్యకర్తలు దాడి చేశారంటూ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. దాడి చేసిన తెరాస కార్యకర్తలపై కేసులు పెట్టలేదని.. కాంగ్రెస్‌ కార్యకర్తలపైనే అక్రమ కేసులు బనాయించారన్నారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులతో భయపెడుతున్నారని ఆయన ఆరోపించారు. తమ కార్యకర్తలపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తే ఊరుకోమని హెచ్చరించారు. తెరాసకు వత్తాసు పలికే అధికారులను గుర్తుపెట్టుకుంటామని.. తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తప్పవన్నారు. రాష్ట్రాన్ని బిహార్‌గా మార్చాలని సీఎం కేసీఆర్‌ చూస్తున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని