ముందే మేల్కొంటే ఇలా అయ్యేది కాదు: దేవినేని

రాయలసీమ, పులిచింతల రైతులను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టించుకోవడం లేదని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ...

Updated : 18 Jul 2021 20:15 IST

అమరావతి: రాయలసీమ, పులిచింతల రైతులను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టించుకోవడం లేదని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఏపీ పరిధిలో కృష్ణా, గోదావరి నదులపై నిర్మాణంలో ఉన్న 107 ప్రాజెక్టులను బోర్డుపరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ అసమర్థ పాలనకు ఇదొక నిరదర్శనమన్నారు. ముందే మేల్కొని అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరి ఉంటే, ఇవాళ రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. పోలవరం సందర్శన పేరుతో ఫొటోలకు పోజులివ్వడం తప్పితే సీఎం చేసిందేమీ లేదని మండిపడ్డారు. పోలవరంలో పునాదులు లేవని గతంలో విమర్శించిన జగన్‌.. ప్రస్తుతం దాదాపు 100 టీఎంసీల గోదావరి జలాలు ఎలా నిలబడ్డాయో చెప్పాలని నిలదీశారు. కొండ ప్రాంతాల్లో బతుకుతున్న గిరిపుత్రులకు ఇళ్లు ఎప్పుడిస్తారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని దేవినేని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని