Yogi Adityanath: కోటిమంది యువతకు స్మార్ట్‌ ఫోన్స్‌, ట్యాబ్స్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోసారి పాగా వేసేందుకు యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం పావులు కదుపుతోంది. అందుకు తగ్గట్టే యువ జనాభాను ఆకట్టుకునేందుకు ఉచితాల జల్లును కురింపించింది. డిజిటల్ సాధికారత పేరిట.. కోటి మంది యువతకు స్మార్ట్‌ ఫోన్స్‌, ట్యాబ్స్‌ ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది. బుధవారం అసెంబ్లీలో అనుబంధ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆదిత్యనాథ్ ఈ ప్రకటన చేశారు. ఈ పథకం కోసం సుమారు రూ.3వేల కోట్లు వెచ్చించనున్నారు.

Updated : 20 Aug 2021 12:56 IST

డిజిటల్ సాధికారత పేరిట విద్యార్థులకు యోగి ఎన్నికల హామీ

 

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోసారి పాగా వేసేందుకు యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం పావులు కదుపుతోంది. అందుకు తగ్గట్టే యువతను ఆకట్టుకునేందుకు ఉచితాల జల్లును కురింపించింది. డిజిటల్ సాధికారత పేరిట.. కోటిమంది యువతకు స్మార్ట్‌ ఫోన్స్‌, ట్యాబ్స్‌ ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది. బుధవారం అసెంబ్లీలో అనుబంధ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆదిత్యనాథ్ ఈ ప్రకటన చేశారు. ఈ పథకం కోసం సుమారు రూ.3వేల కోట్లు వెచ్చించనున్నారు.

‘ఈ పథకం కింద కోటి మంది విద్యార్థుల్ని ఎంపిక చేస్తాము. గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, టెక్నికల్, డిప్లొమా కోర్సులు చదివే విద్యార్థులకు స్మార్ట్‌ ఫోన్స్, ట్యాబ్స్‌ అందించనున్నాం. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు సన్నాహక భత్యం ఇచ్చి సహకరిస్తాం’ అని యోగి వెల్లడించారు. గరిష్ఠంగా మూడు పరీక్షల కోసం ఈ భత్యాన్ని అందజేయనున్నట్లు వివరించారు. 

గతంలో సమాజ్‌వాదీ పార్టీ కూడా ఈ తరహా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 12వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ప్రకటించింది. 2012లో ఆ పార్టీ విజయంలో ఈ హామీ కీలక పాత్ర పోషించింది. కొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకర్షించేందుకు యోగి ప్రకటన దోహదపడుతుందని భాజపా వర్గాలు భావిస్తున్నాయి. విపక్షాలు మాత్రం ఇది మరో తప్పుడు వాగ్దానం అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని