
YS Sharmila: ఏపీలో పార్టీ పెడతారా?.. వైఎస్ షర్మిల సమాధానమిదే..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెట్టడంపై వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ(వైతెపా) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. హైదరాబాద్‌లో మీడియా చిట్‌చాట్‌లో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీలో పార్టీ పెడతారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చని అన్నారు. పార్టీ పెట్టకూడదని రూల్ ఏం లేదు కదా? అని ప్రశ్నించారు.
వైతెపాలో చేరిన తెరాస సీనియర్ నేత
తెరాస సీనియర్ నేత, బీసీ నాయకుడు గట్టు రాంచందర్‌రావు ఇవాళ వైతెపాలో చేరారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వైఎస్ షర్మిల పార్టీ కండువా కప్పి రామచందర్‌ను పార్టీలోకి ఆహ్వానించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.