Janasena: ‘అంబటి.. సినిమా ముచ్చట్లు మాని మీ శాఖపై దృష్టి పెట్టాలి’: జనసేన

సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) తనని కించపరిచే విధంగా సినిమాలు తీస్తున్నారని మంత్రి అంబటి చేసిన ఆరోపణలపై జనసేన నేతలు కౌంటర్ ఇచ్చారు.

Updated : 02 Aug 2023 15:51 IST

తిరుపతి: సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) తనని కించపరిచే విధంగా సినిమాలు తీస్తున్నారని.. సినిమాకు కలెక్షన్లు తగ్గుతుండటంతోనే ‘బ్రో’ సినిమాలోని నటీనటులతో తనపై విమర్శలు చేయిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు (Ambati rambabu) ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా తిరుపతి జిల్లా జనసేన నేతలు మంత్రి అంబటికి గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

పవన్‌ నన్ను కించపరిచే విధంగా సినిమాలు తీస్తున్నారు: అంబటి రాంబాబు

తిరుపతిలో ఎస్‌ఎస్‌ఎస్‌ (SSS) చిత్రానికి జనసేన నేతలు ప్రారంభోత్సవం చేశారు. ‘సందులో సంబరాల శ్యాంబాబు’ (ఎస్‌ఎస్‌ఎస్‌) చిత్రానికి స్థానిక జనసేన నేత కిరణ్‌ రాయల్‌ క్లాప్‌ కొట్టారు. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడితే అంబటి పరిస్థితి అథోగతే అని కిరణ్‌ హెచ్చరించారు. కిరణ్‌ రాయల్‌ మాట్లాడుతూ.. ‘‘తన మంత్రిత్వ శాఖపై పట్టులేని వ్యక్తి అంబటి రాంబాబు. నోరు అదుపులో పెట్టుకోకుంటే అంబటి ఇంటిని ముట్టడిస్తాం. ఆయన పర్యటనలను అడ్డుకుంటాం. సినిమాల గురించి చెప్పడం మాని తన శాఖపై దృష్టి పెట్టాలి. ప్రజలకు మేలు చేసే బుద్ధిని అంబటికి ఆ దేవుడు ప్రసాదించాలి’’ అని కిరణ్‌ రాయల్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు