TRS-CPI: ఖమ్మం జిల్లాలో తెరాస, సీపీఐ వర్గాల మధ్య ఘర్షణ

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కామంచికల్లులో ఇవాళ ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Updated : 02 Dec 2022 11:56 IST

రఘునాథపాలెం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కామంచికల్లులో ఇవాళ ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రామంలోని తెరాస, సీపీఐ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఒక వర్గంపై మరో వర్గం దాడులకు పాల్పడ్డాయి. 

గురువారం రాత్రి ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి సమక్షంలో సీపీఐకి చెందిన సర్పంచ్‌ వెంకటరమణ, ఉప సర్పంచ్‌ ప్రభాకర్‌, మరో వార్డు సభ్యుడు, పలు కుటుంబాలకు చెందిన వారు తెరాసలో చేరారు. ఈ నేపథ్యంలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక బెటాలియన్‌ను తీసుకొచ్చి గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీపీ బస్వారెడ్డి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని