TS News: చెరువుల పరిరక్షణకు లేక్స్‌ స్పెషల్‌ కమిషనర్‌: కేటీఆర్

నగర పరిధిలోని చెరువుల పరిరక్షణకు మూడు రకాల ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి కేటీఆర్‌ శాసనసభలో వెల్లడించారు.

Updated : 04 Oct 2021 14:17 IST

హైదరాబాద్: నగర పరిధిలోని చెరువుల పరిరక్షణకు మూడు రకాల ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి కేటీఆర్‌ శాసనసభలో వెల్లడించారు. సభ్యులు మాధవరం కృష్ణారావు, ప్రకాశ్‌గౌడ్‌, సుభాష్‌రెడ్డి, అక్బరుద్దీన్‌ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. సమగ్ర చెరువుల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా చేపట్టిన చర్యలను ప్రస్తావించారు. చెరువుల చుట్టూ ఫెన్సింగ్‌, వాకింగ్‌ ట్రాక్, సుందరీకరణ, మురుగు కాల్వల మళ్లింపు తదితర అంశాలను వివరించారు.

నగరం పరిధిలో 185 చెరువులు ఉండగా.. 127 అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. రూ.407కోట్ల 30 లక్షలు మంజూరు చేయగా.. రూ.218 కోట్లు ఖర్చు చేశామని కేటీఆర్‌ చెప్పారు. కబ్జాలతో చెరువులు కుచించుకుపోయాయని ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో నిర్మాణాలను తొలగిస్తామని స్పష్టం చేశారు. చెరువుల పరిరక్షణకు కొత్త డివిజన్ ఏర్పాటు చేసి లేక్స్‌ స్పెషల్‌ కమిషనర్‌ను నియమిస్తామని కేటీఆర్‌ వివరించారు. రెండేళ్లతో వందశాతం మురుగునీటిని శుద్ధి చేసి చెరువులను పూర్తిగా పరిరక్షిస్తామని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని