YS Sharmila: దమ్ముంటే సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వండి.. సీఎం కేసీఆర్‌కు షర్మిల సవాల్‌

దమ్ముంటే సిట్టింగ్‌లకు మళ్లీ సీట్లు ఇచ్చి ఎన్నికల బరిలో నిలపాలని సీఎం కేసీఆర్‌ (CM KCR)కు వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సవాల్‌ (YS Sharmila) విసిరారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు.

Published : 23 Jul 2023 19:03 IST

హైదరాబాద్‌: దమ్ముంటే సిట్టింగ్‌లకు మళ్లీ సీట్లు ఇచ్చి ఎన్నికల బరిలో నిలపాలని సీఎం కేసీఆర్‌ (CM KCR)కు వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సవాల్‌ (YS Sharmila) విసిరారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. ‘‘ఉద్యమ సెంటిమెంట్‌తో మొదటిసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. రెండోసారి తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో కుర్చీని కాపాడుకున్నారు. తొమ్మిదేళ్లలో అవినీతిని ఏరులై పారించి, ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టారు. కుటుంబానికి పదవులు కట్టబెట్టి, ఉద్యమ ద్రోహులను నెత్తిన పెట్టుకున్నారు. ఇన్నాళ్లు దొరగారు దర్జాగా గడీల్లో ఉంటే.. ఎమ్మెల్యేలు బందిపోట్ల లెక్క ప్రజల మీదపడి దోచుకున్నారు. కబ్జాలు, అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ప్రశ్నించిన వాళ్లను చితకబాదారు.

ఎన్నికలొచ్చే సరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలపై జనం గుర్రుగా ఉన్నారని తెలుసుకుని సీఎం కేసీఆర్‌ ఉలిక్కిపడుతున్నారు. సిట్టింగులకే సీట్లు అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే... సర్వేల పేరుతో హడావిడి చేస్తున్నారు. ఎమ్మెల్యేలను మారిస్తే తప్ప తాను గట్టెక్కలేనని తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్‌కు వైతెపా సవాల్ విసురుతోంది. మీది అవినీతిరహిత పాలనే అయితే.. హామీలు నెరవేర్చి ఎన్నికల మేనిఫేస్టోకు న్యాయం చేసిన వారే అయితే.. మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చి ఎన్నికల బరిలో నిలవండి.. మళ్లీ గెలిచి మీ పాలనకు ఇది రెఫరెండం అని నిరూపించండి’’ అని షర్మిల ట్వీట్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని