రైతు భరోసా కేంద్రాలు.. దళారుల నిలయాలు

రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు దళారులకు నిలయాలుగా మారాయని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో

Published : 20 May 2022 05:43 IST

జనసేన నేత నాదెండ్ల మనోహర్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు దళారులకు నిలయాలుగా మారాయని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో అక్రమాలపై పోరాడతామని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘రైతుల నుంచి బస్తాకు రూ.200 దోచుకుంటున్నా సీబీఐ దత్తపుత్రుడికి చలనం రావడం లేదు. దీన్ని బట్టే ఈ దోపిడీకి సూత్రధారులెవరో అర్థమవుతోంది. ఆర్బీకేల్లో ధాన్యం అమ్మడానికి వెళుతున్న రైతుల ఆధార్‌ వివరాలు నమోదు చేయకుండా మిల్లర్లు, ఆర్బీకేల నిర్వాహకులు, పౌరసరఫరాల శాఖ చేస్తున్న మాయతో రైతులు మోసపోతున్నారు. రైతుల చిరునామాలు గల్లంతు చేసిన కుంభకోణంపై వైకాపా ఎంపీ.. కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వంలో చలనం లేదు’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని