యూరో వినియోగ దేశాల్లో ధరల మంట

యూరోను వినియోగిస్తున్న 19 యూరోపియన్‌ దేశాల్లో ద్రవ్యోల్బణం జూన్‌లో రికార్డుస్థాయిలో 8.6%గా నమోదైంది. ఈ ఒక్క నెలలోనే ఇంధన ధరలు 41.9%... ఆహారం, మద్యం, పొగాకు

Published : 02 Jul 2022 06:34 IST

రికార్డు స్థాయిలో 8.6% ద్రవ్యోల్బణం

లండన్‌: యూరోను వినియోగిస్తున్న 19 యూరోపియన్‌ దేశాల్లో ద్రవ్యోల్బణం జూన్‌లో రికార్డుస్థాయిలో 8.6%గా నమోదైంది. ఈ ఒక్క నెలలోనే ఇంధన ధరలు 41.9%... ఆహారం, మద్యం, పొగాకు ఉత్పత్తుల ధరలు 8.9%, దుస్తులు, కార్లు, కంప్యూటర్లు, పుస్తకాలు వంటి వస్తువుల ధరలు 4.3%, సేవా రుసుములు 3.4% మేర పెరిగాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాల కారణంగానే ఇంధన ధరలు విపరీతంగా ఎగబాకాయి. ఫలితంగా ఆహారోత్పత్తుల ధరలకూ రెక్కలు వచ్చాయి. యూరోను వినియోగిస్తున్న దేశాల్లో ద్రవ్యోల్బణం మే నెలలో 8.1% కాగా, జూన్‌లో అది రికార్డుస్థాయిలో 8.6%గా నమోదైనట్టు యూరోపియన్‌ యూనియన్‌ స్టాటస్టిక్స్‌ ఏజెన్సీ ‘యూరోస్టాట్‌’ పేర్కొంది. యూరో వినియోగం ఆరంభమైన తర్వాత ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే తొలిసారి అని వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని