సిడ్నీకి వరద పోటు.. శివారు ప్రాంతాలు ఖాళీ

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరాన్ని వరదనీరు ముంచెత్తుతోంది. భారీవర్షాలు కురిసి వరద పోటెత్తడంతో శివారు ప్రాంతాల్లోని వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా ఆదివారం అధికారులు

Published : 04 Jul 2022 06:17 IST

సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరాన్ని వరదనీరు ముంచెత్తుతోంది. భారీవర్షాలు కురిసి వరద పోటెత్తడంతో శివారు ప్రాంతాల్లోని వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా ఆదివారం అధికారులు కోరారు. చుట్టుపక్కల నదులు పొంగి ప్రవహిస్తుండటంతో ప్రాణాంతక అత్యవసర పరిస్థితిగా అధికారులు పరిగణిస్తున్నారు. వాతావరణ విభాగం మరిన్ని భారీవర్షాలు, ఆకస్మిక వరదలు ఉంటాయని.. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఆస్ట్రేలియాలో అత్యధిక జనాభా ఉన్న ఈ నగరంతోపాటు న్యూ సౌత్‌వేల్స్‌ రాష్ట్రంలోని తీరప్రాంతమంతా ఇదే వాతావరణం ఉంది. ప్రజలకు ఏమాత్రం అసౌకర్యంగా ఉన్నా, తమ సూచనల కోసం ఎదురుచూడకుండా సురక్షిత ప్రాంతాలకు తరలాలని అత్యవసర సర్వీసుల మంత్రి స్టెఫ్‌ కూక్‌ ఓ ప్రకటన జారీ చేశారు. పశ్చిమ సిడ్నీ ప్రాంతంలో పలుచోట్ల తరలింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియా రక్షణ దళాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. చాలాచోట్ల 20 నుంచి 30 సెం.మీ.ల మేర వర్షాలు కురిశాయి. సిడ్నీ వార్షిక సగటులో సగం వర్షం ఇప్పటికే నమోదైంది. ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సిందిగా ప్రజలకు సూచనలు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని