రష్యా, జర్మనీ చనిపోయారు.. అమెరికా, ఆఫ్రికా, జపాన్‌ మిగిలారు!

మీరు చదివిన శీర్షిక కరెక్టే. వీరంతా అన్నదమ్ములు. బిహార్‌ రాష్ట్రం పశ్చిమ చంపారన్‌ జిల్లాలోని జమాదర్‌ తోలా గ్రామానికి వెళితే..

Updated : 02 Apr 2022 10:45 IST

మీరు చదివిన శీర్షిక కరెక్టే. వీరంతా అన్నదమ్ములు. బిహార్‌ రాష్ట్రం పశ్చిమ చంపారన్‌ జిల్లాలోని జమాదర్‌ తోలా గ్రామానికి వెళితే.. చనిపోయిన సోదరులు రష్యా, జర్మనీల జ్ఞాపకాలతో జీవిస్తున్న అమెరికా, ఆఫ్రికా, జపాన్‌లను చూడవచ్చు. రెండో ప్రపంచయుద్ధం అనంతరం జమాదర్‌ తోలా గ్రామస్థుడైన అకుల్‌ శర్మ భారత సైన్యంలో చేరారు. యుద్ధంలో శత్రువుల తూటాలు ఆయన భుజంలోకి దిగాయి. ఇంటికి వచ్చి చికిత్స చేయించుకుంటున్న సమయంలోనే సోదరునికి కుమారుడు పుట్టాడు. ఆ బిడ్డకు అకుల్‌ కోరిక మేరకు ‘అమెరికా’ అని పేరు పెట్టారు. ఆ ఇంట.. ఆ తర్వాత పుట్టినవారికి కూడా అదే వరుసలో ఆఫ్రికా, జర్మనీ, రష్యా, జపాన్‌లుగా నామకరణం చేశారు. అందరం కమ్మరి వృత్తి చేస్తామని జపాన్‌ శర్మ తెలిపారు. 2017లో జర్మనీ శర్మ, అంతకుముందు 2012లో రష్యా శర్మ మృతిచెందారు. సోదరులను తలచుకొంటూ మిగతా ముగ్గురం ఎంతో ప్రేమగా బతుకుతున్నామని జపాన్‌ శర్మ చెప్పారు.

ఓ సందర్భంలో పొరుగువారితో గొడవపడ్డారు. వీరిపై కేసు పెట్టాలని ప్రత్యర్థులు ఠాణాకు వెళితే.. శక్తిమంతమైన దేశాల పేర్లు పెట్టుకున్న తమపై కేసు పెట్టలేమని పోలీసులు చెప్పినట్లు వెల్లడించారు. రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య ఇపుడు జరుగుతున్న యుద్ధంపై వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమలాగే సోదరభావంతో ఆ దేశాలు మెలగాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని