బెంగాల్‌లో మరో యువ నటి ఆత్మహత్య

పశ్చిమ బెంగాల్‌ చిత్రసీమలో వరుస ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. యువ నటి, మోడల్‌ మంజుషా నియోగి కోల్‌కతాలోని తన అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం విగతజీవిగా కనిపించారు.

Updated : 28 May 2022 06:34 IST

12 రోజుల వ్యవధిలో ముగ్గురు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ చిత్రసీమలో వరుస ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. యువ నటి, మోడల్‌ మంజుషా నియోగి కోల్‌కతాలోని తన అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం విగతజీవిగా కనిపించారు. మంజుషా స్నేహితురాలు, నటి బిదిషా మజుందార్‌ బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. స్నేహితురాలి మృతితో తీవ్ర కుంగుబాటుకు లోనై మంజుషా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మరో నటి పల్లవి డే కూడా ఈ నెల 15న ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. 12 రోజుల వ్యవధిలో ముగ్గురు మృతిచెందడంతో బెంగాల్‌ చిత్రసీమ విషాదంలో కూరుకుపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని