వైభవంగా పెంపుడు శునకాల వివాహం

కొత్త వస్త్రాలు కట్టుకుని టోపీ పెట్టుకుని వరుడు కొల్హు రాగా.. వధువు వాసంతి కొత్త బట్టలతో పెళ్లి పందిట్లోకి విచ్చేసింది. వీరిద్దరి వివాహం హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లిపందిరి కింద వేద మంత్రాలతో అంగరంగ వైభవంగా జరిగింది.

Published : 23 Jun 2022 05:59 IST

డీజే పాటలతో బరాత్‌.. ప్రత్యేక విందు

కొత్త వస్త్రాలు కట్టుకుని టోపీ పెట్టుకుని వరుడు కొల్హు రాగా.. వధువు వాసంతి కొత్త బట్టలతో పెళ్లి పందిట్లోకి విచ్చేసింది. వీరిద్దరి వివాహం హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లిపందిరి కింద వేద మంత్రాలతో అంగరంగ వైభవంగా జరిగింది. అతిథులకు రకరకాల వంటలతో నోరూరించే భోజనాలు సైతం వడ్డించారు. ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా? ఈ పెళ్లి జరిగింది మనుషులకు కాదు. రెండు పెంపుడు శునకాలకు. బిహార్‌లోని తూర్పు చంపారణ్‌ జిల్లా మోతిహారీలో ఓ అరుదైన వివాహం జరిగింది. మజుర్హాన్‌ గ్రామానికి చెందిన నరేశ్‌ సాహ్నీ, సవితా దేవి దంపతులు తమ పెంపుడు శునకాలకు ఘనంగా వివాహం చేశారు. పండితులు మంత్రాలు చదువుతుండగా.. సహాయకులతో కలిసి వేడుకను నిర్వహించారు. వివాహం అనంతరం శునకాలను గ్రామమంతా ఊరేగించారు. డీజే పాటలకు నృత్యాలు చేశారు. ఈ పెళ్లికి నాలుగు వందల మందికిపైగా ప్రజలు హాజరయ్యారు. వారందరికీ భోజనాలు సైతం పెట్టారు. మరోవైపు, ఇలాంటి పెళ్లిని ఇప్పటివరకు తాము చూడలేదని గ్రామస్థులు, పెళ్లికి వచ్చినవారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని