Chess: భారత 72వ గ్రాండ్‌మాస్టర్‌ మిత్రాబ్‌

సంకల్ప్‌ గుప్తా గ్రాండ్‌మాస్టర్‌ అయిన రెండు రోజుల వ్యవధిలోనే మరో భారత ఆటగాడు మిత్రాబ్‌ గుహ జీఎం హోదా దక్కించుకున్నాడు. సెర్బియాలో జరుగుతున్న మిక్స్‌ 220 టోర్నమెంట్‌లో

Updated : 10 Nov 2021 07:33 IST

చెన్నై: సంకల్ప్‌ గుప్తా గ్రాండ్‌మాస్టర్‌ అయిన రెండు రోజుల వ్యవధిలోనే మరో భారత ఆటగాడు మిత్రాబ్‌ గుహ జీఎం హోదా దక్కించుకున్నాడు. సెర్బియాలో జరుగుతున్న మిక్స్‌ 220 టోర్నమెంట్‌లో అతడు చివరి జీఎం నార్మ్‌ సంపాదించి 72వ భారత గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు. 20 ఏళ్ల మిత్రాబ్‌.. ఇటీవలే బంగ్లాదేశ్‌లో జరిగిన షేక్‌ రసెల్‌ టోర్నీలో రెండో జీఎం నార్మ్‌ దక్కించుకున్నాడు. ‘‘రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు గ్రాండ్‌మాస్టర్లు! 100వ గ్రాండ్‌మాస్టర్‌ త్వరలోనే రాబోతున్నాడు. మిత్రాబ్‌కు శుభాకాంక్షలు’’ అని చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ ట్వీట్‌ చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని