ఐసీయూలో పనిచేయని ఏసీలు

కరీంనగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోని అత్యంత కీలక విభాగమైన ఐసీయూలో ఏసీలు పని చేయడంలేదు. గత కొన్ని రోజులుగా పని చేయకున్నా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. రెండు ఐసీయూ వార్డులో కలిపి మొత్తం ఆరు ఏసీలున్నాయి.

Updated : 30 Apr 2024 10:02 IST

కరీంనగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ఇదీ పరిస్థితి

కరీంనగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోని అత్యంత కీలక విభాగమైన ఐసీయూలో ఏసీలు పని చేయడంలేదు. గత కొన్ని రోజులుగా పని చేయకున్నా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. రెండు ఐసీయూ వార్డులో కలిపి మొత్తం ఆరు ఏసీలున్నాయి. అందులో ఒక్కటే పనిచేస్తుండటంతో చల్లదనం సరిపోవడం లేదు. గత్యంతరం లేక కిటికీలు తీసి ఫ్యాన్లు వేయడంతో వేడి గాలి భరించలేక రోగులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఆరు నెలల కిందట జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని కరీంనగర్‌ వైద్య కళాశాలకు అనుసంధానం చేశారు. అయినా మార్పు రాలేదు. మూడేళ్ల నుంచి పదేపదే దెబ్బతినడంతో మరమ్మతు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని రోగులు మొత్తుకుంటున్నారు.  దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వీరారెడ్డిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా ఏసీల మరమ్మతు విషయం తమ దృష్టికి వచ్చిందని, జిల్లా కలెక్టర్‌కు సమాచారాన్ని నివేదించామని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

న్యూస్‌టుడే, కరీంనగర్‌ సంక్షేమ విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు