ఒక్కటైన బజరంగ్‌ పునియా, సంగీతా ఫోగట్‌

 రెజ్లర్లు బజరంగ్‌ పునియా, సంగీతా ఫోగట్‌లు వివాహబంధంతో ఒక్కటయ్యారు.

Published : 28 Nov 2020 00:58 IST

(ఫొటో సోర్స్‌ : బజరంగ్‌ పునియా ట్విటర్‌)

దిల్లీ: భారత్‌కు చెందిన రెజ్లర్లు బజరంగ్‌ పునియా, సంగీతా ఫోగట్‌లు వివాహబంధంతో ఒక్కటయ్యారు. గురువారం జరిగిన వీరి వివాహానికి సంబంధించిన చిత్రాలను వారిద్దరూ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ బాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌, హాకీ క్రీడాకారిణి రాణీ రాంపాల్‌తో సహా పలువురు ఆ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పునియా తన పాపిట్లో సిందూరం అద్దుతున్న చిత్రాన్ని సంగీతా ఫోగట్‌ షేర్‌ చేశారు. ‘‘నీ వల్ల నా జీవితం పరిపూర్ణమైంది. నువ్వే నా ఆత్మబంధువు.  నా జీవితంలో ఈ కొత్త అధ్యాయం ప్రేమ, సంతోషాలతో నిండి ఉంటుంది.’’ అనే వ్యాఖ్యను దానికి జోడించారు. తాము వివాహం చేసుకోవాలనుకుంటున్నట్టు ఈ జంట 2019లో ప్రకటించిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని